75 శాతం ఉద్యోగులకు ఇంటి నుంచే పని

2025 నాటికి ప్లాన్​ సిద్దం చేసిన టిసిఎస్​

By udayam on November 21st / 12:25 pm IST

2025 నాటికి తమ సంస్థలోని 75 శాతం ఉద్యోగులు వర్క్​ ఫ్రమ్​ హోం కే పరిమితం చేయనున్నట్లు టిసిఎస్​ వెల్లడించింది. కేవలం 25 శాతం మంది ఉద్యోగుల్ని మాత్రమే ఆఫీసులకు పిలుస్తామని తెలిపింది.

దీంతో ఖాళీ అయిన ఆఫీసు కార్యాలయాల్ని సంస్థ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ యూనిట్లకు అప్పగించనున్నట్లు టిసిఎస్​ చీఫ్​ ఫైనాన్షియల్​ ఆఫీసర్​ వి రామకృషన్ణన్​ వెల్లడించారు.

‘‘మేం ఇప్పటికే కార్యాచరణను సిద్దం చేశాం. కేవలం 25 శాతం మందికి మాత్రమే ఆఫీసుల్లో పని ఉండేలా చూస్తున్నాం. అంటే దానర్ధం కేవలం 25 శాతం మందే ఆఫీసులకు వస్తారని కాదు. ఉద్యోగులందరూ ఆఫీసులకు వస్తారు కానీ ఒకే టైం లో కాదు” అని ఆయన వివరించారు.

ప్రస్తుతం తమ సంస్థలోని 95 శాతం మంది ఉద్యోగులు వర్క్​ ఫ్రమ్​ లోనే ఉన్నారని వారంతా మరికొన్ని నెలల పాటు ఇలానే పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.