2004లో విడుదలైన 7/G బృందావన కాలనీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయింది. లవ్ స్టోరీ, కామెడీ జానర్ లో వచ్చిన ఈ చిత్రం, కథ, పాటలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రస్తావన ఎందుకంటే ఈ మూవీకి రెండో పార్ట్ ను తీస్తున్నట్లు నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. రెండో పార్ట్ లోనూ రవి క్రిష్ణే నటిస్తాడని, డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో దీనిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపాడు.