పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్​ ప్రెస్​:.. 8 భోగీల్లో 10 మందికి గాయాలు

By udayam on January 2nd / 5:37 am IST

రాజస్థాన్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బాంద్రా టెర్మినస్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ జోధ్‌పూర్ డివిజన్‌లోని రాజ్‌కియావస్-బొమద్ర మధ్య పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్​