చంద్రబాబు పర్యటనలో తొక్కిసలాట.. 8కి చేరిన మృతులు

By udayam on December 29th / 8:53 am IST

ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటనలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కందుకూరులో చంద్రబాబు రోడ్‌షో, బహిరంగసభ తలపెట్టారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతోపాటు స్థానికులు భారీగా తరలిరావటంతో తొక్కిసలాట జరిగి పరిస్థితి అదుపుతప్పింది. కొందరు రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో పడిపోగా, మరికొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించివారిలో 8మంది చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. మరణించిన వారి కుటుంబాలకు చంద్రబాబు రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.

ట్యాగ్స్​