ఈనెల 8న సముద్రంలో గల్లంతైన 8 మంది మత్స్యకారులను అధికారులు గుర్తించి గురువారం రాత్రి క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అసాని తుపాను ప్రారంభానికి 2 రోజుల ముందు వీరు సముద్రంలో తప్పిపోయారు. మెకానిక్ బోట్లో ఎపిలోని మచిలీపట్నం నుంచి వీరు సముద్రంలో చేపల వేటకు బయల్దేరారని పోలీసులు తెలిపారు. తుపాను రానుందన్న సమాచారం తెలిసినప్పటికీ వీరు చేపల వేటకు బయల్దేరారు. మచిలీపట్నం తీరానికి 150 కి.మీ.ల దూరంలో మలకాయలంక గ్రామం వద్ద వీరి జాడ గుర్తించామని తెలిపారు.