ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ ప్రాంతంలో ఈరోజు టెంపో, ఎస్యువి వాహనాలు గుద్దుకున్న ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. ఘటనా స్థలంలోనే 6 గురు మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. సత్సంగ్‌లో భాగంగా ప్రయాణికులు బదౌన్–మణిపూర్ హైవేలో టెంపోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ.. బాధితులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు.