లోయలో పడ్డ అయ్యప్ప భక్తుల వాహనం.. 8 మంది మృతి

By udayam on December 24th / 6:04 am IST

తమిళనాడులోని థేని జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. కుమిలి పర్వత మార్గం వద్ద 40 అడుగుల లోతున్న లోయలోకి కారు దూసుకువెళ్ళడంతో 8 మంది భక్తులు దుర్మరణం చెందారు. వీరంతా అయ్యప్పను దర్శనం చేసుకుని తిరిగి స్వస్థలాలకు వస్తుండగా శనివారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అండిపట్టి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​