జమ్మూ కశ్మీర్లో గురువారం తెల్లవారుఝామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఆర్మీ అధికారి సైతం ఉన్నారు. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై వెళ్తున్న వీరి క్యాబ్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో క్యాబ్ కార్గిల్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నట్లు ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 5 గురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.