చైనా: హనాన్​ ప్రావిన్స్​ లో 9 కోట్ల మందికి కరోనా!

By udayam on January 11th / 6:10 am IST

చైనాలో కరోనా వైరస్ అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ప్రతి రోజు లక్షలాదిమంది వైరస్ బారినపడుతున్నారు. మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా, చైనాకు సంబంధించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్క హెనాన్ రాష్ట్రంలోనే దాదాపు 8.85 కోట్ల మంది కరోనా బాధితులుగా మారినట్టు ప్రావిన్షియల్ అధికారి కాన్ క్యూయాన్ చెంగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంటే రాష్ట్రంలోని దాదాపు 90 శాతం మంది కరోనా బారినపడినట్టు లెక్క.

ట్యాగ్స్​