ఇల్లు రాలేదని అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం

By udayam on May 3rd / 10:04 am IST

తనకు ప్రభుత్వం నుంచి డబుల్​ బెడ్​ రూమ్​ ఇల్లు దక్కడం లేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి తెలంగాణ అసెంబ్లీ ఎదుట హల్​చల్​ చేశాడు. ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న అసెంబ్లీ సిబ్బంది అతడిని ఆపి పోలీసులకు సమాచారం అందించారు. డబుల్​ బెడ్​రూమ్​ ఇంటికి కావాల్సిన అన్ని అర్హతులు ఉన్నా.. ఆపై ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకు ప్రభుత్వం నుంచి ఇల్లు రావడం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ట్యాగ్స్​