తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆమెను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపటి క్రితం ఆమె చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను కూడా స్వీకరించారు. సీఎస్ గా ఆమె ఏప్రిల్ 2025 వరకు కొనసాగనున్నారు. శాంతికుమారి 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు.