విశాఖ: చికిత్స పొందుతూ మృతి చెందిన శశికళ

By udayam on December 9th / 5:43 am IST

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ట్రైన్​ కు, ప్లాట్​ ఫాం కు మధ్య చిక్కుకుపోయి గాయపడ్డ శశికళ(19) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ ప్రమాదంలో ఆమె నడుము భాగంలోని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్గత రక్తస్రావం కూడా అవడంతో కోమాలోకి వెళ్లింది. వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అన్నవరానికి చెందిన ఆమె దువ్వాడ విజ్ఞాన్‌ కళాశాలలో ఎంసిఎ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రోజూ ఇంటి నుంచి కళాశాలకు రైలుతో రాకపోకలు సాగిస్తుండేది.

ట్యాగ్స్​