ఏపీ : స్కూల్స్​ లో ఆధార్​ శిబిరాలు

By udayam on January 18th / 5:17 am IST

ఆదార్‌ నమోదు, సవరణల కోసం పాఠశాలలు, సచివాలయాల్లో ఈ నెల 19 నుంచి నాలుగు రోజులు, మళ్లీ ఫిబ్రవరి నెలలో 7 నుంచి నాలుగు రోజులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఓలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌ నమోదు క్యాంపులు జనవరి 19, 21, 23, 24తో పాటు ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు ఆదార్‌ ప్రత్యేక శిభిరాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ట్యాగ్స్​