ఆప్ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టిన కార్యకర్తలు

By udayam on November 23rd / 6:16 am IST

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్​ సింగ్​ యాదవ్​ పై సొంత పార్టీ కార్యకర్తలే చెప్పులతో తిరగబడ్డారు. ఈ హఠాత్​ పరిణామానికి తేరుకుని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంటే వెంటపడి మరీ చెప్పులతో కొట్టారు. దాడి ఎందుకు జరిగిందనే విషయంపై ఆప్ వర్గాల నుంచి స్పష్టత లేదు. అయితే, ఢిల్లీలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతలు పార్టీ టికెట్లను అమ్మకానికి పెట్టారని, అది సహించలేకే మాటియాలా నియోజకవర్గం ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ను కార్యకర్తలు కొట్టారని చెబుతున్నారు.

ట్యాగ్స్​