రాబోయే రెండేళ్ళలో ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలోనూ తమ పార్టీ అభ్యర్ధులను నిలబెడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వెల్లడించారు.
ఈరోజు ఆప్ 9వ జాతీయ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ మేరకు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఢిల్లీ ఘటనపై మాట్లాడుతూ ‘‘రిపబ్లిక్ డే న ఢిల్లీలో జరిగింది దారుణం. అయితే పోలీసులు కొందరు రైతులపై తప్పుడు కేసులు బనాయించారు. నిజమైన దేశ ద్రోహులను వదిలేశారు” అంటూ వ్యాఖ్యానించారు.
‘‘ఒక్కటి మాత్రం నిజం. రైతుల సమస్య పరిష్కారం కాలేదు. అంటే దేశం ఇంకా సుభిక్షంగా ఉన్నట్టు కాదు. వారిని బాధపెట్టిన కేంద్రం ఏమీ బాగుపడలేదు” అని పేర్కొన్నారు.