గుజరాత్​ ఎన్నికలు : ఆప్ అభ్యర్థి కిడ్నాప్​.. ఆపై దొరికిన ఆచూకీ

By udayam on November 16th / 9:41 am IST

గుజరాత్​ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ తరపున నామినేషన్​ వేసిన ఓ అభ్యర్ధి నిన్న కిడ్నాప్​ అయ్యాడు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఆప్​ నాయకుడు సిసోడియా.. బిజెపినే టార్గెట్​ చేస్తూ.. కమలం శ్రేణులే మా అభ్యర్ధి కంచన్​ జరివాలాను కిడ్నాప్​ చేసి, నామినేషన్​ వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన కొద్ది నిమిషాలకే ఆ అభ్యర్ధి ఆచూకీ దొరికిందంటూ ఆప్​ నాయకులు వివరణ ఇచ్చారు. కంచన్​ సూరత్​ ఈస్ట్​ నియోజకవర్గం నుంచి నామినేషన్​ ను వేశారు.

ట్యాగ్స్​