అంపైర్లూ సుఖంగా నిద్రపోండి : డివిలియర్స్​

By udayam on October 13th / 5:02 am IST

ఐపిఎల్​ కెప్టెన్సీకి విరాట్​ కోహ్లీ రాజీనామా అనంతరం కొంత మంది అంపైర్లకు ఇప్పుడు సుఖంగా నిద్ర పడుతుందని ఎబి డివిలియర్స్​ అన్నాడు. కోల్​కతాతో మ్యాచ్​లో ఆన్​ఫీల్డ్​ అంపైర్​ వీరేందర్​ శర్మతో కోహ్లీ 2 సార్లు వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. దీనిపైనే మ్యాచ్​ ముగిసిన అనంతరం డివిలియర్స్​ స్పందించాడు. ‘నీ పనిని నీవు గొప్పగా చేశావు. కానీ పుస్తకం ఇంకా అప్పుడే పూర్తవలేదు. మా కోసం నువ్వేం చేశావో మేం ఎప్పటికీ మరిచిపోం. మంచి జ్ఞాపకాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కొంత మంది అంపైర్లకు ఇకనైనా సుఖంగా నిద్రపట్టొచ్చు’ అని డివిలయర్స్​ మ్యాచ్​ అనంతరం మాట్లాడాడు.

ట్యాగ్స్​