ధియేటర్లలోకి వస్తేనే ఆస్కార్​ రేస్​లోకి

By udayam on May 21st / 6:25 am IST

కరోనా కాలంలో డిజిటల్​ మీడియా, ఓటిటి ప్లాట్​ఫామ్స్​లో రిలీజైన సినిమాలను సైతం ఆస్కార్​ అవార్డులకు ఎంపిక చేసిన అకాడమీ సభ్యులు ఇప్పుడు ఆ నిబంధనలో మార్పులు చేశారు. ఇకపై ఈ ఏడాది నుంచి ధియేటర్లలో రిలీజైన సినిమాలకే ఆస్కార్​ అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్​ 31 లోపు ధియేటర్లలో రిలీజైన సినిమాలకే ఈ అవార్డు కోసం అర్హతగా నిర్ణయించారు. ధియేటర్స్​ రీ ఓపెన్​ అవుతున్న కారణంగా అకాడమీ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ట్యాగ్స్​