ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న దాడులు

By udayam on February 20th / 11:55 am IST

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కననదుర్గమ్మ సన్నిధిలో గత రెండు రోజులుగా సోదాలు చేసిన ఏసీబీ అధికారులు మూడో రోజు శనివారం కూడా దాడులు నిర్వహిస్తున్నారు.

అంతర్గత బదిలీలు, టెండర్లపై అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అవినీతి లేకుండా చేయడానికే : వెల్లంపల్లి

దుర్గగుడిలో ఏసీబీ దాడులపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ.. ప్రభుత్వంలో ఏసీబీ ఓ భాగమన్నారు.

జగన్ వచ్చాక ఏసీబీ దాడులు పెరిగాయని, ఎక్కడా అవినీతి జరగకుండా ఉండటానికి దాడులు చేపడుతున్నట్లు చెప్పారు. ద్వారక తిరుమలలో కూడా గతంలో ఏసీబీ దాడులు జరిగాయని గుర్తుచేశారు.

ట్యాగ్స్​