అయోధ్య రామమందిర ఉద్యమ నేత ధర్మేంద్ర మృతి

By udayam on September 20th / 6:20 am IST

విశ్వ హిందూ పరిషద్​ నేత, అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఉక్కు సంకల్పం కట్టుకున్న ఆచార్య స్వామి ధర్మేంద్ర (80) కన్నుమూశారు. ఆరోగ్య సంబంధిత కారణాలతో జైపూర్​లోని ఎస్​ఎంఎస్​ ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ఉత్తర ప్రదేశ్​ సిఎం యోగి ఆదిత్యనాథ్​తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ మత సంస్థలు నివాళులర్పించాయి. అయోధ్యలో కరసేవకుడిగా పనిచేసిన ఆయన అనంతర కాలంలో అయోధ్య రామ మందిర నిర్మాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.

ట్యాగ్స్​