మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ డిజాస్టర్‌పై నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజగోపాల్ బజాజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. చిరంజీవికి లేఖ రాశారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఈ లేఖలో ‘కొవిడ్ కష్టాలతో తీవ్రంగా నష్టపోయిన మమ్మల్ని మీ మూవీ ఆచార్య మరింతంగా దిగజార్చింది. ఈ సినిమాపై మేం పెట్టిన 100లో 25 శాతమే తిరిగొచ్చింది. అప్పులు చేసి తెచ్చి ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన నాలాంటి వాళ్ళను చిరంజీవి గారే ఆదుకోవాలి’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.