ఛాతీ నొప్పితో ఆసుపత్రికి అన్నా హజారే

By udayam on November 26th / 6:50 am IST

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హాజరే ఈరోజు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. 84 ఏళ్ళ హజారే ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆయన అనుచరులు ఆయనను పూణేలోని రూబీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు జరిపిన టెస్టుల్లో గుండెలోని కరోనరీ అల్టెరీలో బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సో దానిని తొలగించారు. ప్రస్తుతం ఆయన నిలకడగా కోలుకుంటున్నారు. త్వరలోనే డిశ్చార్జ్​ చేస్తామని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్​