ప్రేమదేశం ఫేమ్ అబ్బాస్ కు ప్రమాదం

By udayam on November 22nd / 4:32 am IST

ప్రేమదేశం ఫేమ్ అబ్బాస్ ప్రమాదానికి గురయ్యారు. 1996లో ప్రేమ దేశం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అబ్బాస్.. ఆ మూవీతోనే ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్నారు. మొదటి సినిమా తోనే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ప్రేమ దేశం తర్వాత తెలుగు తో పాటు తమిళ్ లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అబ్బాస్..తాజాగా ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో షేర్ చేసి అభిమానులకు షాకిచ్చాడు. బైక్ పై నుంచి పడి గాయపడ్డానని, కొన్నిరోజులుగా విపరీతమైన కాలి నొప్పితో బాధపడుతున్నానని వెల్లడించారు. డాక్టర్లు శస్త్రచికిత్స తప్పనిసరి అని చెప్పారని తెలిపారు. సర్జరీ అనగానే గందరగోళానికి లోనయ్యానని, అయితే సర్జరీ చేయించుకున్నాక ఎంతో ఉపశమనం పొందానని పేర్కొన్నారు.

ట్యాగ్స్​