ప్రముఖ హీరో బాలకృష్ణ పెను ప్రమాదం తప్పింది. ఒంగోలు నుండి హైదరాబాద్ కు ఆయన హెలికాప్టర్ లో వెళ్తుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. టేక్ ఆఫ్ అయినా కొద్దిసేపటికి సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలెట్ గుర్తించారు. వెంటనే ఒంగోలు పోలీస్ గ్రౌండ్ కు తిరిగి వచ్చి హెలికాప్టర్ ను లాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం నుండి బాలకృష్ణ బయపడ్డారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు వెళ్లి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒంగోలులోని అర్జున్ ఇన్‌ఫ్రాలో శుక్రవారం రాత్రి ముగించుకొని ఉదయం తిరుగు పయనం అయ్యారు.