నటుడు చలపతిరావు అంత్యక్రియలు మహా ప్రస్థానంలో బుధవారం ముగిశాయి. కుమారుడు రవిబాబు చలపతిరావుకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈనెల 24న గుండెపోటుతో చలపతిరావు మృతి చెందిన సంగతి విదితమే. విదేశాల్లో ఉన్న కుమార్తెల రాక ఆలస్యం కావడంతో చలపతిరావు భౌతికకాయాన్ని మహాప్రస్థానంలోని ఫ్రిజర్ బాక్స్‌లో ఉంచారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో చలపతిరావు కుమారుడు రవిబాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలలో చలపతిరావు కుటుంబ సభ్యులతోపాటు మంచు మనోజ్, నిర్మాతలు సురేష్ బాబు, దామోదర ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీవాస్‌లు హాజరయ్యారు.