రూ.200 కోట్ల మోసం కేసు: రక్కమ్మ బుక్కయిందా?

By udayam on September 20th / 6:39 am IST

రూ.200 కోట్ల మేరకు ఓ వ్యాపార వేత్త భార్యను మోసం చేశారన్న ఆరోపణలపై బాలీవుడ్​ నటి, విక్రాంత్​ రోణ రక్కమ్మను ఢిల్లీ పోలీసుకు చెందిన ఆర్ధిక నేరాల విభాగం సుదీర్ఘంగా విచారించింది. సోమవారం ఉదయం మొదలైన ఈ విచారణ 7 గంటల పాటు సాగింది. దొంగ బాబా సుకేష్​ చంద్రశేఖర్​తో కలిసి ఆమె ఈ మోసానికి పాల్పడిందా? లేదా? అన్నది ఈ విచారణలో తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ కేసులో శ్రీలంక సుందరిని ప్రశ్నించడం ఇది రెండోసారి. గత బుధవారం 8 గంటలపాటు జాక్వెలిన్​ను ప్రశ్నించారు.

ట్యాగ్స్​