జోడో యాత్రలో కమల్​ హాసన్​

By udayam on December 19th / 7:24 am IST

రాహుల్​ గాంధీ చేస్తున్న దేశవ్యాప్త ‘భారత్​ జోడో యాత్ర’ లో దిగ్గజ నటుడు కమల్​ హాసన్​ కూడా భాగం కానున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కూడా అయిన కమల్​.. రాహుల్​ ఆహ్వానం మేరకు ఈ యాత్రలో కమల్​ తో కలిసి ఈనెల 24న నడనున్నారు. అప్పటికి ఈ యాత్ర రాజస్థాన్​ ను దాటి ఢిల్లీలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ యాత్రకు 8 రోజుల విశ్రాంతిని ఇవ్వనున్నారు. ఆపై ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్​, హర్యానా, పంజాబ్​ లలో పర్యటించి జమ్మూ కశ్మీర్​ లోకి ప్రవేశిస్తుంది.

ట్యాగ్స్​