దేశంలో పదే పదే వినిపిస్తున్న పాన్ ఇండియా మూవీ అనే వర్డింగ్పై నటుడు సిద్దార్థ్ ఫైర్ అయ్యాడు. నిజానికి ఈ పదం వల్లే ప్రాంతీయ భాషలపై వివాదాలు వస్తున్నాయని చెప్పిన అతడు.. పాన్ ఇండియాకు బదులు ఇండియన్ సినిమా అనాలని చెబుతున్నాడు. ఇండియన్ సినిమా అనేది బాలీవుడ్ నుంచి వస్తుందని.. పాన్ ఇండియా అంటే అదొక దక్షిణాది సినిమాగా ముద్ర పడుతోందని చెప్పాడు. 15 ఏళ్ళ క్రితం తాను బాలీవుడ్లో ఉన్న టైంలో క్రాస్ ఇండియా మూవీ అనే పదం ఉండేదని చెప్పుకొచ్చాడు.