టాలీవుడ్ సీనియర్ కపుల్ శ్రీకాంత్, ఊహ దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ జరుగుతున్న వదంతులను హీరో శ్రీకాంత్ కొట్టిపారేశాడు. దీనిపై ప్రెస్ నోట్ విడుదల చేసిన హీరో.. ‘ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను ఎవరు పుట్టిస్తున్నారు? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ‘ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు.. ఆందోళన పడవద్దు’ అని తనను ఓదార్చాను’ అని చెప్పారు.