ఐసియులో సీనియర్​ నటుడు రాజేందర్​

By udayam on May 24th / 9:22 am IST

తమిళ సీనియర్​ నటుడు, నిర్మాత టి.రాజేందర్​ తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసియులో చికిత్స కొనసాగుతోందని కోలీవుడ్​ మీడియా పేర్కొంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆరోగ్యం ఈరోజు మరింత క్షీణించడంతో ఐసియులో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే అతడిని సింగపూర్​కు తరలించాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. అతడి కొడుకు, నటుడు శింబు సైతం రాజేందర్​తో సింగపూర్​ వెళ్ళనున్నారు.

ట్యాగ్స్​