చెక్​ బౌన్స్​ కేసులో రాధిక దంపతులకు ఏడాది జైలు

By udayam on April 7th / 10:31 am IST

సీనియర్​ నటులు, భార్యా భర్తలైన రాధిక, శరత్​ కుమార్​లకు ఈరోజు చెన్నైలోని స్పెషల్​ కోర్టు చెక్​ బౌన్స్​ కేసులో ఏడాది జైలు శిక్షను విధించింది. దాంతో పాటు రూ.5 కోట్ల జరిమానా సైతం వేసింది. 2018లో వీరిపై ఈ కేసు నమోదైంది. మేజిక్​ ఫ్రేమ్స్​ కంపెనీ పేరిట సినిమాలు తీసే రాధికా, శరత్​ కుమార్​ దంపతులపై రేడియెన్స్​ మీడియా ప్రైవేట్​ లిమిటెడ్​ ఈ కేసు వేసింది. తమకు మొత్తం రూ.1.5 కోట్లు వీళ్ళు చెల్లించాలని, రూ.10 లక్షల చొప్పున మొత్తం 5 చెక్కులూ బౌన్స్​ అయ్యాయని రేడియెన్స్​ చెప్పింది.

ట్యాగ్స్​