అందువల్లే ఛార్మి పేరెంట్స్ కి కరోనా

By udayam on October 27th / 6:41 am IST

ఒకప్పుడు న‌టి గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు నిర్మాతగా సత్తా చాటుతున్న చార్మీ కౌర్ త‌ల్లిదండ్రులు క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని వారంతా ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

తాజాగా వారి ఆరోగ్య ప‌రిస్థితి గురించి ట్వీట్ చేశారు. “నా పేరెంట్స్‌ను న‌వ్వు ముఖాల‌తో చూడ‌టం చాలా బాగుంది” అని సంతోషం వ్య‌క్తం చేశారు. కాగా చార్మీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు చెప్తూనే త‌న‌ త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా సోకిందంటూ ఎమోషన్ అయింది.

“లాక్‌డౌన్ ప్రారంభ‌మైన మార్చి నుంచి వారు నిబంధ‌న‌ల‌ను తు.చ త‌ప్ప‌కుండా పాటిస్తున్నారని ఛార్మి చెప్పింది. అయినా దురదృష్టం కొద్దీ వారు కోవిడ్‌-19 బారిన పడ్డారంటే, అందుకు బ‌హుశా హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల మూలాన అయి ఉంటుందని పేర్కొంది. ఇప్ప‌టికే మా నాన్న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో ఈ వార్త విని నా గుండె ముక్క‌ల‌య్యింద ని ఉద్వేగానికి లోనయింది.

“పాజిటివ్ వచ్చిన వెంట‌నే అమ్మానాన్న ఇద్ద‌రూ ఏఐజీ ఆస్ప‌త్రిలో చేరారు. అక్క‌డ నాకు చాలాకాలంగా తెలిసిన‌ డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందం వారిని జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం నా త‌ల్లిదండ్రులు చికిత్స‌కు స్పందిస్తు న్నారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా” అని ఛార్మి పేర్కొంది.