తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నటి, ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ప్రకటించారు. 2 రోజుల క్రితం సైతం ఆమె ఇలాంటి ప్రకటనే చేసి ఆపై డిలీట్ చేశారు. అనంతరం బుధవారం సాయంత్రం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కలిసి చర్చించిన ఆమె కొద్దిసేపటికే మళ్ళీ రాజీనామా ప్రకటనను చేశారు. చంద్రబాబుతో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను త్వరలోనే వెల్లడిస్తానని, ఇప్పటి వరకూ తనకు సహకరించిన తేదేపా శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.