వీళ్లిద్దరి వద్దే 30 శాతం డబ్బు

By udayam on November 30th / 5:32 am IST

అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో దేశ ప్రజల ఆదాయాలు పడిపోతుంటే.. కార్పొరేట్ల సంపద మాత్రం వేల కోట్లు పెరుగుతూ పోతోంది. అమెరికాకు చెందిన ఫోర్బ్స్‌ మాగజైన్‌ భారత్‌లోని వంద మంది సంపన్నుల జాబితా-2022ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది వీరి సంపద రూ.2 లక్షల కోట్లు (25 బిలియన్‌ డాలర్లు) పెరిగి మొత్తంగా 800 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.65.32 లక్షల కోట్లు)కు చేరిందని ఫోర్బ్స్‌ తెలిపింది. ఆ 100 మంది టాప్‌ సంపన్నుల వద్ద ఉన్న సొమ్ములో 30 శాతం అదానీ, అంబానీ వద్దే పోగు పడింది. అదానీ రూ.12.2 లక్షల కోట్ల సంపదతో తొలి స్థానంలో నిలిచారు. అదాని సంపద ఈ ఒక్క ఏడాదిలోనే రెట్టింపైందని ఫోర్బ్స్‌ తెలిపింది. ముకేష్‌ అంబానీ రూ.7.18 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.

ట్యాగ్స్​