మీడియా రంగంలోకి గౌతమ్​ అదానీ

By udayam on May 17th / 7:39 am IST

ఆసియా కుబేరుడు గౌతమ్​ అదానీ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనకు చెందిన ఏఎంజీ మీడియా నెట్​వర్క్స్​.. క్వింట్ డిజిటల్​ మీడియాలో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్​ కుదర్చడంలో సంస్థకు చెందిన సీనియర్​ జర్నలిస్ట్​ సంజయ్​ పుగాలియా కీలకంగా వ్యవహరించారు. పబ్లిషింగ్​, అడ్వర్టైజింగ్​, బ్రాడ్​ కాస్టింగ్​ రంగాల్లో ఈ సంస్థ లాభాల బాటలో పయనిస్తోంది. ఇటీవల బాసుమతీ బియ్యం వ్యాపారం చేసే కోహినూర్​ కంపెనీని అదానీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​