అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ ఎపి నుంచి రాజ్యసభకు నామినేట్ కానున్నట్లు సమాచారం. ఆయన లేదా ఆయన భార్య డాక్టర్ ప్రీతి అదానీలలో ఒకరికి వైఎస్సార్సిపి తన 4 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని కేటాయించనుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకలో జగన్‌ను కలిసిన అమిత్ షా ఈ మేరకు చేసిన విజ్ఞప్తిని జగన్ అంగీకరించారు. మిగతా 3 సీట్లలో ఒకటి విజయసాయి రెడ్డికి, మరొకటి నెల్లూరుకు చెందిన వీద మస్తాన్‌రావుకు, మరొకటి సిఎం లాయర్ నిరంజన్ రెడ్డి లేదా కిల్లి కృపారాణిలకు దక్కనుంది.