అత్యంత సురక్షిత జిల్లాల్లో ఆదిలాబాద్​ కు నేషనల్​ టాప్​ 5 ర్యాంక్​

By udayam on January 9th / 10:41 am IST

దేశంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాల్లో 5వ స్థానాన్ని దక్కించుకుంది ఆదిలాబాద్​. తెలంగాణ రాష్ట్రంలో టాప్​ ర్యాంక్ ను కొట్టేసింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన సామాజిక ప్రగతి సూచిక, సురక్షితమైన జిల్లాల నివేదిక ప్రకారం.. 85 మార్కులతో ఆదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లాగా దేశంలో ఐదవ స్థానాన్ని సంపాదించింది. ఈ ర్యాంకింగ్‌లో నాగాలాండ్‌లోని మొకొక్ జిల్లా 89.89 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా 81 మార్కులతో కరీనంగర్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. 62 మార్కులతో హైదరాబాద్ మధ్యస్థంగా ఉండగా.. భద్రాద్రి కొత్తగూడెం (44), రాజన్న సిరిసిల్ల (47), సూర్యాపేట (48) అల్యల్ప స్కోరింగ్ సాధించాయి.

ట్యాగ్స్​