అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇంటెన్స్ క్రైమ్ స్టోరీ హిట్ – ది సెకండ్ కేస్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది జులై 29న ఈ మూవీని ధియేటర్లలో లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై హీరో నాని నిర్మిస్తున్న ఈ సినిమాలో అడవి శేష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తోంది.