ముంబై ఉగ్రదాడుల్లో కన్నుమూసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులకు తాను రెండో కొడుకు లాంటివాడినని నటుడు అడవి శేష్ చెప్పుకొచ్చాడు. ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రం విడుదల సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్లలో శేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘వాళ్ళను నేను ఒకే ఒక్కసారి కలిశా. అంకుల్ నన్ను పలుమార్లు కౌగిలించుకున్నారు. నేను నిజ జీవితంలో మేజర్‌ను కాలేను. కానీ ఈ దంపతులకు రెండో కొడుకును అవుతా’ అని చెప్పాడు.