అడవి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ ట్రైలర్ వచ్చేసింది. 26/11 తాజ్ హోటల్‌పై పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల దాడి నేపధ్యంలో జరిగిన రియల్ లైఫ్ సన్నివేశాల స్ఫూర్తితోనూ, ఆ ఘటనలో దేశం కోసం ప్రాణాలొదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. మహేష్‌బాబు నిర్మించిన ఈ మూవీ వచ్చే నెల 3న విడుదల కానుంది. ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, ప్రకాష్ రాజ్ డైలాగులు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి.