తెలుగు జెండా అంటూ ఏపీ సిఎం ట్వీట్​.. తప్పుబట్టిన అద్నాన్​ సమీ

By udayam on January 12th / 7:00 am IST

ఆర్​ఆర్​ఆర్​ మూవీలోని నాటు నాటు సాంగ్​ కు గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్​ దక్కడంపై ఏపీ సిఎం జగన్​ చేసిన ట్వీట్​ వివాదం రేపుతోంది. ఆర్​ఆర్​ఆర్​ టీం కు శుభాకాంక్షలు చెబుతూ ‘తెలుగు జెండా పై పైకి ఎగురుతోంది. ఆంధ్రప్రదేశ్​ తరపున మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అంటూ జగన్​ ట్వీట్​ చేశారు. అయితే ఈ ట్వీట్​ చూసిన అద్నాన్​ సమీతో పాటు పలువురు నెటిజన్లు ‘తెలుగు జెండానా? మీరు అనాల్సింది భారతీయ జెండా అని. అన్నింటికంటే ముందు మనమంతా భారతీయులం. దేశం నుంచి మిమ్మల్ని మీరు వేరుపరచుకోవడం తక్షణం ఆపేయాలి’ అంటూ సింగర్​ అద్నాన్​ సమీ విరుచుకుపడ్డాడు.

ట్యాగ్స్​