ఇటీవల విడాకులు తీసుకున్న సౌత్ టాప్ స్టార్ ధనుష్ బాలీవుడ్‌పై కన్నేశాడు. 2013లో రంజానా మూవీతో ధనుష్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసి ఇటీవల అత్రాంగిరే తో మరో హిట్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలోనే ఓ యాక్షన్ మూవీ చేయడానికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో రానున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అభిమానులు సైతం ఈ కలయికపై ఆతృతగా ఉన్నారు. ఈ మూవీ కోసం ధనుష్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకోనున్నాడని సమాచారం.