ఆసుపత్రుల వ్యాపారంలోకి అదానీ గ్రూప్​

By udayam on May 19th / 11:32 am IST

ఇటీవలే ఎసిసి, అంబుజా సిమెంట్​ కంపెనీలను దక్కించుకోవడానికి బిడ్లు వేసిన అదానీ గ్రూప్​ తాజాగా హెల్త్​కేర్​ రంగంలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం అదానీ హెల్త్​ వెంచర్ లిమిటెడ్​ను సైతం మే 17వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ సాయంతో దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఆసుపత్రి చైన్​లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఆఫ్​లైన్​, డిజిటల్​ ఫార్మా కంపెనీలను సైతం దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ట్యాగ్స్​