కశ్మీర్ లోయలో సామాన్య ప్రజలపై ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్ చోకర్ను చంపేశారు. నిన్న జరిగిన కశ్మీరీ పండిట్ హత్యపై ఆ రాష్ట్ర:లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలోనే కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. అహ్మద్‌పై బుల్లెట్ల వర్షం కురిపించడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.