క్రికెట్​ను భారత్​ శాసిస్తోంది : ఇమ్రాన్​ ఖాన్​

By udayam on October 13th / 11:07 am IST

ప్రపంచ క్రికెట్​ను భారత్​ శాసిస్తోందని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఆరోపించారు. మిడిల్​ ఈస్ట్​ ఐ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యలూ ఖాన్​ సాబ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘క్రికెట్​లో అందరి కంటే మంచి ప్లేయర్​ డబ్బు. ప్లేయర్లకు అదే కావాలి. బోర్డులకూ అదే కావాలి. భారత్​లో ఉన్న అపరమిత డబ్బు కోసం క్రికెట్​ బోర్డులన్నీ దాసోహమంటున్నాయి. దాంతో ఆ దేశం ప్రపంచ క్రికెట్​ను తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని ఆడిస్తోంది. మా దేశానికి రాని జట్లు పొరుగు దేశం భారత్​కు మాత్రం ఎలాంటి అడ్డంకులు లేవంటూ వెళ్తున్నాయి’ అంటూ అక్కసు వెళ్ళగక్కాడు.

ట్యాగ్స్​