తెరాసలోకి కౌశిక్​రెడ్డి

By udayam on July 22nd / 2:23 am IST

హుజూరాబాద్​ కాంగ్రెస్​ ఇన్​ఛార్జ్​ కౌశిక్​ రెడ్డి ఈరోజు సిఎం కెసిఆర్​ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరారు. ఆయనకు, ఆయన పరివారానికి కెసిఆర్​ టిఆర్​ఎస్​ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువ నేత కౌశిక్​ రెడ్డి చేరడం సంతోషంగా ఉందన్న కెసిఆర్​ కౌశిక్​ తండ్రి సాయినాథ్​ రెడ్డి తనతో కలిసి పనిచేశారని తెలిపారు. చిన్న పదవి ఇచ్చి కౌశిక్​ను సరిపెట్టనని చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసే కౌశిక్​ టిఆర్​ఎస్​లోకి వచ్చారని కెసిఆర్​ అన్నారు.

ట్యాగ్స్​