బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో మంగళవారం మొదలైన కుదుపు తీవ్రమవుతోంది. మంగళవారం నాడు ఆర్ధిక మంత్రి రిషి సనక్తో పాటు ఆరోగ్య మంత్రి సాజిద్లు రాజీనామా చేయగా.. బుధవారం నాడు మరో 5 గురు మంత్రులు పదవులను వదిలేశారు. మంత్రులు కెమి బాడెనోచ్, నీల్ ఓ’బ్రియన్, అలెక్స్ బర్గార్ట్, లీ రౌలీ, జూలియా లోపెజ్లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా తాను మాత్రం ప్రధాని పీఠాన్ని దిగేది లేదంటున్నాడు బోరిస్.