ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కన్నడ మూవీ కేజీఎఫ్ సిరీస్ పై హోంబేల్ ఫిలింస్ నిర్మాతలు చిన్న అప్డేట్ ఇచ్చారు. ఈ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ మూవీ సలార్ తో బిజీగా ఉన్నారని, ఆ షూటింగ్ కంప్లీట్ అయ్యాకే కేజీఎఫ్–3 కోసం ఆయనతో చర్చిస్తామని విజయ్ కరంగదుర్ వెల్లడించారు. అయితే కేజీఎఫ్–3 తప్పకుండా ఉంటుందని ఆయన మరోసారి ధీమాగా ప్రకటించారు.