నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల వినూత్న లవ్ స్టోరీ 18 పేజెస్ ఓటిటి రిలీజ్ పై అప్పుడే చర్చ మొదలైంది. ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ మూవీ ఓటిటి రైట్స్ ను ఆహా, నెట్ ఫ్లిక్స్ లు సొంతం చేసుకున్నాయి. శుక్రవారమే రిలీజై హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ.. ఇప్పట్లో ధియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకోదు. కాబట్టి ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కోసం మరికొంత కాలం ఆగాల్సిందే. సుకుమార్ ఇచ్చిన ఈ యూత్ ఫుల్ కథకు, గోపీసుందర్ మ్యూజిక్ తోడై ఆడియెన్స్ విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు.