ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో గత వారం జరిగిన రామ్సన్ వేర్ సైబర్ అటాక్ మూలాలు చైనాలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం డేటా మొత్తాన్ని తిరిగి సెక్యూర్ చేసినట్లు ప్రకటించిన ఈ సంస్థ 5 ఫిజికల్ సర్వర్స్ లో ఉన్న లక్షలాది మంది పేషెంట్ల వివరాలను హ్యాకర్లు యాక్సెస్ చేయగలిగారని తెలిపింది. ఎయిమ్స్ లోని మొత్తం 100 సర్వర్లలో 40 ఫిజికల్, 60 వర్చువల్ సర్వర్లు ఉండగా.. వీటిల్లో 5 సర్వర్లపై హ్యాకర్లు దాడి చేశారు.